ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ నేత లేఖ

ఏపీలో తునికాకు టెండర్లు ఇప్పటివరకు పిలవలేదు

ramakrishna
ramakrishna

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ముఖ్యంగా లేఖలో తునికాకు టెండర్ల విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో తునికాకు టెండర్లు ఇప్పటివరకు పిలవలేదని… ప్రతి ఏటా డిసెంబర్, జనవరి నెలలో పిలిచేవారని రామకృష్ణ పేర్కొన్నారు. తునికాకు టెండర్లు పిలవకపోవడం వల్ల కార్మికులకు, గిరిజనులకు ఉపాధి కరువైందన్నారు. ఇప్పటికే తెలంగాణలో టెండర్లు పిలిచారని వెల్లడించారు. ఆలస్యంగా టెండర్లు పిలిస్తే లేటుగా ప్రూనింగ్ చేయడంతో ఆకు నాణ్యత లోపిస్తుందన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును ఈ వారంలో సందర్శించనున్నట్లు తెలుస్తోందని.. ఈలోగానే తునికాకు టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/