ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ఉద్ధవ్ థాకరే

ఢిల్లీ అట్టుడుకుతుంటే అమిత్ షా ఎక్కడున్నారు?

uddhav thackeray
uddhav thackeray

మంబయి: మహారాష్ట్ర సిఎం, శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరే ఢిల్లీలో అల్లర్ల పై స్పందించారు. ఈనేపథ్యంలో ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసతో ఓ వైపు ఢిల్లీ అట్టుడుకుతుంటే అమిత్ షా ఎక్కడున్నారని అని ఆయన అన్నారు. అమిత్ షా ఆచూకీ తెలియడం లేదని… ఈ అల్లర్ల గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవళ్ కనిపించారని, అక్కడి ప్రజలతో మాట్లాడారని… కానీ, అమిత్ షా మాత్రం కనిపించలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కనిపించిన అమిత్ షా ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో 39 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అల్లర్లకు సంబంధించి 45 మందిపై ఎఫ్ఊఆర్ లు నమోదయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/