సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అంటే సుందరానికీ’..

సెన్సార్ కార్యక్రమాలను పూర్తీ చేసుకుంది అంటే సుందరానికీ. శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ చేస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను స్పీడ్ చేసింది.

ఇప్పటీకే ఫస్ట్ లుక్ , టీజర్ ఆసక్తి రేపగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ ఆసక్తి పెంచారు. ఇక ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసారు. సినిమా చూసిన బోర్డు సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ (U) సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్స్ ఈ సినిమాని ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది. ఇక ఈ మూవీ రన్ టైం 2 గంటల 56 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ‘అంటే సుందరానికీ’ మూవీ దాదాపు 3 గంటల సేపు ఉండబోతోంది. ఒక రోమ్ కామ్ జోనర్ చిత్రానికి ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. మరి మూడు గంటలసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టి ఏవిధంగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. బ్రహ్మణ యువకునిగా నానీ, క్రిస్టియన్ అమ్మాయిగా నజ్రియా నటించిన ఈ సినిమా.. వీరిద్దరి ప్రేమకథ, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యంలో హిలేరియస్ కామెడీని అందించబోతోంది. ఇందులో నానీకి ఒక చెప్పుకోలేని బలహీనత ఉంటుంది. అదేంటి అనేది మేకర్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. అదే ఈ సినిమాకి హైలైట్ కానున్నదని సమాచారం.

ఇక ఈ మూవీ లో ఇందులో సీనియర్ నరేష్ – రోహిణి – శ్రీకాంత్ అయ్యంగార్ – నదియా – హర్ష వర్ధన్ – రాహుల్ రామకృష్ణ – సుహాస్ – పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.