నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటన ..

నేడు వరంగల్ , హన్మకొండ లలో మంత్రి కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఈ సంద‌ర్భంగా పలు ప్రారం‌భో‌త్సవాలు, శంకు‌స్థా‌ప‌నలు చేయ‌ను‌న్నారు. ఉదయం 9.20 గంట‌లకుహైద‌రా‌బాద్‌ నుంచి హెలీ‌కా‌ప్టర్‌లో వరం‌గల్‌ జిల్లాకు చేరు‌కుంటారు. కాక‌తీయ మెగా టెక్స్‌‌టైల్‌ పార్కులో కిటెక్స్‌ పరి‌శ్రమ ఏర్పా‌టుకు భూమి పూజ చేయ‌ను‌న్నారు. ఆ తర్వాత మిషన్‌ భగీ‌రథ వాటర్‌ ట్యాంకు పను‌లకు శంకు‌స్థా‌పన చేయ‌డం‌తో‌పాటు పలు పరి‌శ్రమ‌లను ప్రారం‌భిం‌చ‌ను‌న్నారు. అనంతరం మాము‌నూరు ఎయి‌ర్‌‌పో‌ర్టును సంద‌ర్శి‌స్తారు. 12 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ సందర్శన ఉండగా.. మధ్యాహ్నం 12.45 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు పయనం కానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో కాజీపేట సెయింట్ గాబ్రియల్ గ్రౌండు, 1.15 గంటలకు రాంనగర్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో భోజన విరామం, 2.00 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు , ఎంపీలు , ప్రజాప్రతినిధు లతో సమావేశం ఉండనుంది. 3 గంటలకు విలేకరులతో సమావేశం, 3.45 గంటలకు నయీంనగర్ లోని చైతన్య డిగ్రీ కళాశాలలో సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ ఆఫీసు ప్రారం భోత్సవం ఉండనుంది. 4.15 గంటలకు వడ్డెపల్లిలోని పీజేఆర్ గార్డెన్స్లో జరిగే సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ కంపెనీ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 5:45కు సెయింట్ గాబ్రియల్ మైదానానికి చేరుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.