తెలంగాణలో ఇవాళ , రేపు వ్యాక్సిన్ లేనట్టే

కావలసిన టీకాలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది

Covid Vaccination--
Covid Vaccination–

Hyderabad: దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. . అయితే, తెలంగాణ‌ రాష్ట్రంలో 45 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇప్పటికీ పూర్తికాలేదు. మొదటి డోస్ కోసం , రెండో డోసు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ. శ్రీనివాస్ ప్రకటించారు. ఇప్పటికే తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/