10 ఏళ్ల చిన్నారి కోరిక తీర్చిన మెగా పవర్ స్టార్

అభిమాని కోరిక తీర్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. తనను ఎంతో అభిమానించే ఓ పదేళ్ళ బాలుడు క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నాడు. ఇక తనకి రామ్ చరణ్ ని చూడాలని ఉందంటూ ఆ బాలుడు తన కోరిక బయట పెట్టాడు. దీంతో తల్లిదండ్రులు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ని సంప్రదించారు. ఇలా అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి సమీపించే వారి కోరికలని ఫుల్ ఫిల్ చేయడంలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ విశేషమైన సేవలు అందిస్తుంది.

ఈ నేపధ్యంలో బాలుడి కోరిక గురించి మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ చరణ్ సంప్రదించి తెలియజేశారు. వెంటనే చరణ్ కలిసి వద్దామని చెప్పి..వారితో పాటు వెళ్లి హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆ చిన్నారిని పలకరించాడు. ఆ పదేళ్ళ చిన్నారి బాలుడి పక్కన కూర్చొని కొద్దిసేపు తనతో మాట్లాడాడు. ట్రీట్మెంట్ తీసుకోవాలని మరల నువ్వు ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావ్ అంటూ బాలుడికి భరోసా ఇచ్చాడు. తన అభిమాన నటుడు తన వద్దకు రావడం , మాట్లాడడం తో ఆ చిన్నారి ఎంతో సంతోషపడ్డాడు. ఆ తల్లిదండ్రులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం వీటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా నటిస్తుంది.