‘పశ్చిమ’లో పాజిటివ్ కేసులు

పలువురికి నిర్ధారణ పరీక్షలు

  • టి .నర్సాపురం మండలంలో సెకండ్ వేవ్
  • ఇటీవల ఓ ఇంట్లో ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమం
  • ఒకరికి పాజిటివ్ . అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న పలువురు
Corona cases
Corona cases

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం ఓ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించండంతో కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమం జరిగిన ఇంట్లో ఒకరికి పాజిటివ్ రావడంతో కార్యక్రమంలో పాల్గొన్న మిగతా 60 మంది గ్రామస్థులు పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులు రావాల్సివుందని వైద్యులు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/