సిఎం జగన్‌ రాజధాని రైతులతో చర్చించాలి

జలదీక్షలో పాల్గొన్న మందడం రైతులు డిమాండ్‌

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఏపి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అమరావతి రైతులు ఆందోళన తీవ్రం తరం చేస్తున్నారు. సేవ్‌ అమరావతి పేరుతో రాజధాని రైతులు చేపట్టిన దీక్షలు 51 వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా రైతులు తాళ్లాయిపాలెంలో కృష్ణా నదిలో దిగి మందడం రైతులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ సీఎం అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సేవ్‌ అమరావతి, సేవ్‌ ఏపి అంటూ నినాదాలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/