తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Hyderabad: కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు.
వీటికి అనుబంధంగా ఉన్న అన్ని హాస్టల్స్ కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాస్ లు ఉంటాయని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. విద్యార్థులు ,తల్లిదండ్రుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామన్న ఆమె వైద్య కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలకు వర్తిస్తుందని అన్నారు.
పక్క రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేసిన సంధర్భంలో తెలంగాణలో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నామని అన్నారు. అయితే ఆన్ లైన్ లో తరగతులు కొనసాగుతాయని అన్నారు. అన్ని మండలాలలోని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/