సామాన్యులఫై గ్యాస్ భారం..భారీగా పెరిగిన వంట గ్యాస్ ధ‌ర‌

సామాన్య ప్రజల ఫై గ్యాస్ భారం పడింది. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెంచాయి చమురు సంస్థలు. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఢిల్లీలో నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.899.50చేరింది.

కాగా సెప్టెంబర్‌ నెలలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్‌ ధర రూ.190 పెంచినట్లైంది. దసరా పండగవేళ గ్యాస్ ధర పెంచడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కేంద్రం ఫై మండిపడుతున్నారు. ఓ పక్క పెట్రోల్ , డీజిల్ ధరలు రోజు రోజుకు పెరగడం , నిత్యావసర ధరలు పెరుగుతుండడం..ఇవి చాలదన్నట్లు గ్యాస్ ధరలు కూడా పెరగడం ఫై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.