ఏపీ పోలీసు శాఖకు జాతీయస్థాయి గుర్తింపు గర్వకారణం
-మంత్రి మేకతోటి సుచరిత

Guntur: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని పోలీసు శాఖ ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణంగా వుందని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆధునీకరించిన రూరల్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధరాజు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దామోదర్ గౌతమ్ సవాంగ్ తో కలసి పాల్గొన్నారు. రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి మేకతోటి సుచరిత తొలుత పోలీస్ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీసు కార్యాలయ ఆవరణలోని శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. జిల్లా పోలీసు కార్యాలయం, రూరల్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి నాడు – నేడు ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఆధునీకరించిన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధరాజు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దామోదర్ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన సభ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, గుంటూరు రేంజ్ డిఐజి సియం. త్రివిక్రమ్ వర్మ, రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ, శాసన సభ్యులతో కలసి ఆవిష్కరించి కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఛాంబర్, ఆధునీకరించిన ఇతర విభాగాలను ప్రారంభించి పరిశీలించారు.
అనంతరం జరిగిన సభలో రాష్ట్ర మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తున్నదంటే గత ఎనిమిది నెలల కాలంలో ఏపి పోలీసులు జాతీయ స్థాయిలో 125 అవార్డులు, పురస్కారాలు అందుకోవడమే అందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో నిర్వహించిన సమావేశంలో బాధలు, కష్టాలతో పోలీసు స్టేషన్ల కు వచ్చే బాధితులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారన్నారు.

Participating were Minister of State for Home and Disaster Management Mekatoti Sucharitha, Minister in charge of District Cherukuvada Sriranga Nathraju, Director General of Police Damodar Gautam Sawang
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దామోదర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నాడు – నేడు పధకం స్పూర్తితో పోలీసు స్టేషన్ల లోను మెరుగైన వసతులు కల్పించేందుకు గుంటూరు రూరల్ పోలీసు కార్యాలయంతో పాటు జిల్లాలోని 64 రూరల్ పోలీసు స్టేషన్లను ఆధునీకరించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీసు స్టేషన్ల లో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా పోలిసుల ప్రవర్తనలోనూ, పనితీరులోను గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సూచించిన విధంగా పోలీసు స్టేషన్ల కు సమస్యలతో వచ్చే బాధితులను చిరునవ్వుతో పలకరించడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేలా సమర్ధవంతగా, ప్రభావవంతంగా మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
మహిళలు, వృద్దులు, బలహీన వర్గాల వారు, సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని, పోలీసు శాఖ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ఏపి పోలీసు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో 125 అవార్డులను అందుకోవడం జరిగిందన్నారు. రూల్ ఆఫ్ లా కు మూల స్తంభాలైన జవాబుదారీతనం, పారదర్శకత పోలీసు శాఖలో ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు సమర్ధవంతంగా, బాధ్యతగా విధులు నిర్వహించారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితులలోను ప్రజా ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని మానవత్వంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు కీలకమైన విధులు నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు శాఖ మెరుగైన సేవలు అందిస్తుందన్నారు.
రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి , శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన సభ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ , గుంటూరు రేంజ్ డిఐజి సియం. త్రివిక్రమ్ వర్మ , రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీపాల్గొన్నారు.
రూరల్ జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు స్టేషన్ల ఆధునీకరణకు సి ఎస్ ఆర్ నిధులు అందించిన దాతలకు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత జ్ఞాపికలు అందించారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు, రూరల్ జిల్లా ఎస్ఇబి అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, అర్బన్, రూరల్ జిల్లా పోలీసు అధికారులు, రూరల్ జిల్లా పోలీసు పరిధిలోని గ్రామ మహిళా సంరక్షణ అధికారులు పాల్గొన్నారు.
తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/