రేవంత్ పై కేఏ పాల్ ఫైర్

పాదయాత్రలో సీఎం కేసీఆర్ ఫై , ప్రగతి భవన్ ఫై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ,కార్యకర్తలే కాదు ఇతర పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో భాగంగా ములుగు లో మాట్లాడుతూ కేసీఆర్ ఫై , సర్కార్ ఫై పలు విమర్శలు చేయడం..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యల ఫై బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం..పలు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటె తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. భూకబ్జాలు చేసి రేవంత్ ఈ స్థాయికి వచ్చారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ దని చెప్పారు. రేవంత్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రేవంత్ ఎన్నడూ పోరాడలేదని… కాంగ్రెస్ పార్టీలో ఆయనొక జూనియర్ నేత అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించి… బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.