జగన్‌ ఫారిన్‌ టూర్‌పై నేడు కోర్టు తీర్పు

cm-jagan

అమరావతిః సీఎం జగన్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఎంతో బిజీగా గడిపారు. ఎన్నికల ముగియడంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ కోరారు. తన కుమార్తెలు లండన్ లో ఉంటున్నారని… వారి వద్దకు వెళ్లాలని తెలిపారు. యూకేతో పాటు జెరూసలేం, స్విట్జర్లాండ్ కు వెళ్లాల్సి ఉందని చెప్పారు. అయితే, జగన్ విదేశీ పర్యటనకు అనుమతించవద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈరోజు జగన్ ఫారిన్ టూర్ కు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించనుంది.