ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు వ‌ద్దు

జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు మరో లేఖ

అమరావతి : ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ కు ఈ రోజు మరో రాశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద పోలీసు కేసుల నమోదును ఆపాలని ఆయ‌న కోరారు. ఎందుకంటే ఆ చ‌ట్టం ద్వారా.. సామాజిక మాధ్య‌మాల‌ కార్యకలాపాలపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

నిజానికి ఈ చ‌ట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినప్ప‌టికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని తెలిపారు. ఎవరైనా త‌న‌ ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీసు స్టేషన్ ల‌కు పిలుస్తున్నారని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా చూసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/