ఏపిలో 2,000 దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 38 మందికి కరోనా

అమరావతి: ఏపి కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5 కేసులు నమోదయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని వివరించింది.
జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/