విశాఖ ఘటన పై సిఎం జగన్‌ కీలక ఆదేశాలు

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహంచారు. సహాయక చర్యలు, పరిహారంపై పరిశీలించిన ఆయన.. మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల్లో మిగతా వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని స్పష్టం చేశారు. ప్రభావిత గ్రామాల ప్రజల వైద్యం కోసం క్లినిక్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు గ్యాస్ లీక్ ఘటన అనంతరం తీసుకున్న చర్యలను సిఎంకు వివరించారు. గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటల కల్లా ఇవి ముగుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని సిఎంకి తెలిపారు. బాధితులు చాలామంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మంత్రులంతా ఆ 5 గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలని ఆదేశించారు. శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/