భారత్‌లో 27,892కి చేరిన కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 1,396 కేసులు నమోదు..872కి చేరిన మరణాల సంఖ్య

corona-india
corona-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్తగా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,396 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కి చేరుకుంది. వీటిలో 20,835 యాక్టివ్ కేసులు ఉండగా 6,185 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 872కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/