ముస్లింలకు మాంసాహరాన్ని అనుమతించం

గాంధీ ఆసుపత్రి యాజమాన్యం కీలక నిర్ణయం

gandhi hospital
gandhi hospital

హైదరాబాద్‌: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉండేవారు సాయంత్రం దీక్ష ముగిసిన తరువాత వారు మాంసాహారాన్ని భుజిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా కొందరు రోగులు ఆసుపత్రులలో ఉండడంతో వారికి మాంసాహరాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నారు. రంజాన్‌ మాసం అయినప్పటికి ముస్లిం రోగులకు మాంసాహరాన్ని అనుమతించబోమని తెలిపారు. అందుకు బదులుగా డ్రై ప్రూట్స్‌, గుడ్డు, కిచిడి, వెజ్‌ బిర్యాని ఇస్తామని తెలిపారు. మాంసాహారం, మసాలాల వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరిండెంట్‌ ఎం. రాజారావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/