రేపు కేబినెట్ భేటీ : లాక్ డౌన్ పై తుది నిర్ణయం
ఇప్పటికే భిన్నాభిప్రాయాలు

Hyderabad: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రగతి భవన్ లో జరగనుంది. సీఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా , లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా ఉంది. కాగా , తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వ స్పష్టం చేసిన విషయం విదితమే. ఏదెలా వున్నా రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కానుందా ? లేదా? అనే విషయం మంగళవారం మధ్యాహ్నం తేలనుంది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/