జర్మనీలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు

పరిస్థితులు మెరుగవ్వడంతో..కొన్ని వెసులుబాట్లు

COVID-19 'under control', Germany
COVID-19 ‘under control’, Germany

జర్మనీ: జర్మనీ ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా సోమవారం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కొన్ని ఏరియాల్లో చిన్న షాపులు తెరచుకోవచ్చని చెప్పింది. జర్మనీలో కరోనా కంట్రోల్ అయ్యిందని ప్రకటించారు. ఇకపై జర్మనీలో పూల దుకాణాలు, ఫ్యాషన్ స్టోర్లు, అంటే… 8600 చదరపు మీటర్ల లోపు ఉండే షాపులన్నీ తెరచుకున్నట్లే. వాటిలోకి ఇకపై ప్రజలు సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ వెళ్లవచ్చు. నెల కిందట జర్మనీ లాక్‌డౌన్ విధించినప్పుడు… అత్యంత కఠినంగా అమలుచేసింది. ఇప్పుడు జర్మనీలోని 16 రాష్ట్రాలు… వేర్వేరు ప్రదేశాల్లో నిబంధనల్ని సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం… ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ కఠినంగానే ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం జర్మనీలో 145742 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా… వాటిలో 91500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 మందికి మాత్రమే కరోనా సీరియస్‌గా ఉంది. మిగతావాళ్లకు కరోనా తగ్గిపోయే అవకాశాలు 99 శాతం ఉన్నాయి. జర్మనీలో కరోనా మృతుల సంఖ్య 4642గా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/