రావణ దహన కార్యక్రమంలో పాల్గొనబోతున్న ప్రభాస్

దసరా సందర్భాంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగనున్న రావణ దహనం కార్యక్రమానికి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరుకాబోతున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి రావణ దహనం కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ప్రభాస్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు.

ప్రతి ఏడాది కూడా దసరా పండుగ రోజున రావణుడి దిష్టిబొమ్మను కాల్చి వేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీల మైదానంలో జరగబోయే ఈ దసరా వేడుకలకు అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు.. అయితే ఈ రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే గొప్పవారు ఎవరు ఉంటారు అని అందుకే ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.