తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా పాజిటివ్ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2,56,713- మృతుల సంఖ్య 1,401

corona spread in Telangana
corona spread in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య తాజా బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24  గంటల్లో అంటే మొన్నరాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 1050 మంది కరోనా బారిన పడ్డారు.

అదే సమయంలో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,401కి పెరిగింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/