ముక్తేశ్వరస్వామికి సిఎం ప్రత్యేక పూజలు

కాళేశ్వరం: సిఎం కెసిఆర్ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరఘాట్‌లో త్రివేణి సంగమం వద్ద సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదిలో నాణాలు వదిలి జల నీరాజనాలు అర్పించారు. అనంతరం సిఎం కెసిఆర్ ముక్తేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. వేదపండితులు కెసిఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సిఎం కెసిఆర్ పర్యటనలో సీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/