దీపాలతో అయోధ్య దేదీప్యమానం
రామాయణం ఘట్టాల ప్రదర్శన

Ayodhya: దీపావళి పండుగ పురస్కరించుకుని అయోధ్య దేదీప్యమానంగా వెలుగుతోంది.. సుమారు 6లక్షల దీపాల వెలుగులో పుణ్యప్రదేశం మరింత పునీతమైంది..
ఈ దీపోత్సవం వేడుక ఆదివారం రాత్రి వరకు ఉంటుందని తెలిపారు.. ఈ సందర్భంగా శ్రీరాముడు సీతాసమేతంగా పుష్పకవిమాన వాహనంలో లంక నుంచి వచ్చిన ఘటనను లేజర్ షోద్వారా ప్రదర్శించారు..

ఈ వేడుకలు యుపి గవర్నర్ అనందీబెన్ పటేల్, సిఎం యోగి ఆదిత్యనాధ్ తదితరులు హాజరయ్యారు.
అయోధ్యలోని సాకేత్ కళాశాల నుంచి నదీతీరం వరకు సుమారు 5 కిమీ పొడవున శ్రీరామపట్టాభిషేకం ఘట్టాన్ని శకదాల ద్వారా ప్రదర్శించారు

కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ,జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్కుమార్ తెలిపారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/