చికిత్స కోసం తెలంగాణకు వచ్చే కరోనా పేషెంట్స్ కు ప్రభుత్వం మార్గదర్శకాలు
ప్రత్యేక కాల్ సెంటర్ 040- 2465119, 9494438351 ఏర్పాటు

- ముందుగా ఆస్పత్రి అనుమతి అవసరం
- వైద్యశాలలో బెడ్ కన్ఫర్మేషన్ ఉండాలి
- అంబులెన్సులు , ఇతర వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
Hyderabad: కరోనా బాధితులకు చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి ఆస్పత్రి అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయా ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్ ( 040- 2465119, 9494438351) ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తప్పనిసరిగా ఫోన్ నెంబర్లకు సమాచారవ అందివ్వాలని పేర్కొంది. అంబులెన్స్ , ఇతర వాహనాలకు ముందస్తు అనుమతి ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/