‘టీం ఇండియా మమ్మల్ని తప్పుదోవ పట్టించింది’

ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Tim Paine
Tim Paine

ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మా దృష్టిని మళ్లించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మోసపూరితంగా గెలిచిందని పేర్కొన్నాడు. తమను టీమిండియా తప్పుదోవ పట్టించిందని ఎద్దేవా చేశాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత గబ్బాకు వెళ్లబోమని టీమిండియా చెప్పిందని… నాల్గవ టెస్ట్ ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఒకవిధంగా గందరగోళం సృష్టించి ఆస్ట్రేలియా జట్టు ఏకాగ్రతను దెబ్బతీసిందని అన్నాడు.ఇండియా చేసిన పనికి తాము ఆటపై సరిగా దృష్టి పెట్టలేకపోయామని టిమ్ పైన్ చెప్పాడు. అయితే పైన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారత అభిమానులు విరుచుకుపడుతున్నారు.