APSRTC కోట్ల ఆదాయం తెచ్చిపెట్టిన సంక్రాంతి

సంక్రాంతి పండగ APSRTC కి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. సంక్రాంతి అంటే ఏపీ..ఏపీ అంటే సంక్రాంతి అనే విధంగా సంక్రాంతి సంబరాలు ఏపీలో అంబరాన్ని తాకాయి. పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇక సంక్రాంతి సందర్బంగా APSRTC సైతం పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ బస్సులనే కాకుండా ప్రత్యేక బస్సులను ఏర్పటు చేసింది. దీంతో RTC కి భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. 1,483 ప్రత్యేక బస్సులు నడిపించడమే కాకుండా, జనవరి 6 వ తేదీ నుంచి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపారు. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్‌ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు ప్రజలు. రాను-పోను టికెట్లపై బుక్‌ చేసుకున్న వారికి టిక్కెట్‌ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఆదాయం రావడానికి కలిసొచ్చింది.

అలాగే TSRTC లో సైతం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులు నడిపించారు.