నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు కీలక ప్రకటన

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఫైళ్ల మాయం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ ఘటన అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగవ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు తాళాలను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డికి కేసుకు సంబంధించిన పత్రాలను, ఇతర పరికరాలను చోరీ చేశారు.

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలను తీసుకెళ్లారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఈరోజు ఆదేశాలను జారీ చేసింది. గత ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కోర్టులో దొంగలు పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.