రాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు

New Delhi: దేశవ్యాప్తంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పండుగ హోలీ సమాజంలో సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ‘ఇది వసంత రుతువు రాకను చెప్పే పండుగ అని, దేశప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను’’ అని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ‘ పరస్పర ప్రేమ, ఆప్యాయత, సోదర భావానికి ప్రతీక హోలీ అని , ఈ పండుగ ప్రజల జీవితంలో ఆనందం తీసుకురావాలి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం : https://www.vaartha.com/andhra-pradesh/