త్వరలో మరో 5 కొత్త వ్యాక్సిన్లు

వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

5 more new vaccines coming soon
5 more new vaccines coming soon

New Delhi: దేశంలో అక్టోబర్ నాటికి మరో 5 రకాలైన కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. రష్యా కు చెందిన స్ప్రు త్నిక్ టీకా కు భారత్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరగటంతో కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాల ప్రక్రియకు మరింత విసరిపచేయాలని యోచన చేస్తోంది.

అదనంగా వ్యాక్సిన్లు తీసుకు రావటానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా కోవిద్ షీల్డ్, కో వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మూడవ త్రైమాసికంలో మరో 5 కొత్త వ్యాక్సిన్లు తీసుకురావాలని చూస్తోంది. స్పుత్నిక్ టీకా వాక్సిన్ కు డాక్టర్ రెడ్డీస్ సౌజన్యంతో పరీక్షలు జరుగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/