కరోనా తగ్గుముఖం పట్టింది: ట్రంప్‌

మరణాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేసున్నాం

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పటింందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. గడచిన ఐదారు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతుండడంతో సామాజిక దూరంపై కొత్త విధివిధాన్నాన్ని రూపొందించే అవకాశం లభించిందని అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ఇప్పటివరకు అమెరికాలో 6.3లక్షల మందికి కరోనా పాజిటివ్‌ రాగా. 28 వేల మందికి పైగా మరణాలు సంభవించాయి. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ సంఖ్య సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మరణాల సంఖ్యను మరింతగా తగ్గించడానికి కృషి చేస్తామని తెలిపారు. దీనిపై రాష్ట్రాలకు విడివిడి మార్గదర్శకాలు రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కోన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/