ఏటీయం సర్వీస్‌ ఛార్జీలు ఎత్తివేసిన ఎస్‌బీఐ

ఉచిత లావాదేవిల పరిమితుల ఎత్తివేత

no transactions limit
no transactions limit

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో, తమ ఖాతాదారులపై అదనపు భారం పడకూడదన్న ఉద్దేశ్యంతో ఎస్‌బిఐ ఏటీఎం సర్వీస్‌ చార్జిలను ఎత్తివేస్తు నిర్ణయం తీసుకుంది. అలాగే ఏటిఎం ల ద్వారా పొందే ఉచిత లావాదేవిల పరిమితులను సైతం ఎత్తివేసింది. ఈ నిర్ణయం జూన్‌ 30 వరకు అమలులోఉంటుందని తెలిపింది. దీనితో ఏ ఏటిఎంలోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చని అందుకు అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. అదేవిధంగా సైబర్‌ నేరాగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/