స్పిన్‌ బౌలింగ్‌లో అతని బ్యాటింగ్‌ విధ్వంసం

అతనికి బౌలింగ్‌ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేది : ఆఫ్రీది

 shahid afridi
shahid afridi

కరాచీ: వెస్టిండిస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారాకు బౌళింగ్‌ చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేదని పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆప్రిది తెలిపాడు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో లారాను చాలా సార్లు ఔట్‌ చేసిన్పటికి బంతిని బౌండరీకి తరలిస్తాడనే భయం తనలో ఉండేదని అన్నాడు. ఇప్పటికి కూడా లారాకు బౌలింగ్‌ చేయాలంటే మాత్రం జంకుతానని తెలిపాడు. అతని ప్రభావం నాపై చాలా ఉండేది. అని చెప్పుకొచ్చాడు. లారా ఓ వరల్డ్‌క్లాస్‌ బ్యాట్స్‌మన్‌. స్పిన్నర్లపై పూర్తి ఆదిపత్యం చెలాయించేవాడు. దిగ్గజ స్పిన్నర్లు సైతం లారా ముందు తేలిపోయారు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కూడా లారా చేతిలో మూల్యం చెల్లించుకున్నాడు. స్పిన్నర్లపై అతని పుట్‌వర్క్‌ అమోఘం. స్పిన్‌ బౌలింగ్‌లో అతని బ్యాటింగ్‌ విధ్వంసం అంటూ లారాపై ప్రశంశల జల్లు కురిపించాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/