నైట్ ఫ్రాంక్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

minister-ktr-inaugurated-the-knight-frank-office-in-hyderabad

హైదరాబాద్‌: రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్‌ హైద‌రాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఆ ప్రాంతంలో ర‌వాణా, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. రియ‌ల్ ఎస్టేట్ స‌ర్వేలో నైట్ ఫ్రాంక్ ఇండియా ప్ర‌సిద్ధిగాంచింది అని కెటిఆర్ తెలిపారు. అమెజాన్, గూగుల్ వంటి అంత‌ర్జాతీయ సంస్థ‌లు హైద‌రాబాద్‌లో ఆఫీసులు ప్రారంభించాయి. ఇండ్లు, స్థ‌లాల ధ‌ర‌లు హైద‌రాబాద్‌లో అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో దూసుకుపోతుంద‌న్నారు. ఆరేళ్ల‌లో రాష్ట్రం అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను త‌ట్టుకునేలా నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా లీడ‌ర్‌షిప్ సిబ్బంది పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/