మూలపేట గ్రీన్‌పీల్డ్ పోర్టుకు సిఎం జగన్ శంకుస్థాపన

Hon’ble CM will be Laying Foundation Stone to Mulapeta Port, Performing Bhoomi Puja & Samudra Puja

శ్రీకాకుళం: సిఎం జగన్‌ జిల్లాలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణపనులకు బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. మూలపేటలో రూ. 4,362 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 23.5 మలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు. 30 నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. మూలపేట పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించనుంది. 854 కుటుంబాలు ఈ పోర్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారనున్నాయి. దీంతో వీరికి పరిహారం కోసం ప్రభుత్వం రూ. 109 కోట్లు కేటాయించింది.

కాగా, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరుకుల రవాణా మరింత సులభం కానుంది.ఈ పోర్టు ద్వారా సుమారు 25 వేల మందికి ఉపాధి దొరకనుందిమూలపేట పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు గంగమ్మతల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజ.లు నిర్వహించారు. పోర్టు నిర్మాణ పనుల నిర్మాణం కోసం ఈరోజు ఉదయం అమరావతి నుండి విశాఖకు సీఎం చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మూలపేటకు చేరుకున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్టుపాలెం ఒడ్డున రూ. 360 కోట్లతో షిఫింగ్ హార్బర్ కు , గొట్టా నుండి వంశధారకు లిఫ్ట్ ఇగిరేష్ ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.