రష్యాలో 3లక్షలకు చేరిన కరోనా కేసులు

Corona cases – Russia

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3లక్షల మార్క్‌ దాటింది. ఈరోజు కొత్తగా 8,764 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 308,705కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 135 మంది చనిపోవడంతో కరోనా వల్ల ఇప్పటివరకూ 2,972 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన అమెరికా తర్వాత రష్యానే రెండో స్థానంలో ఉంది. ఇటీవల కరోనా బారిన పడిన రష్యా ప్రధాని మైకేల్‌ మిషుస్తిన్‌ పూర్తిగా కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/