ఇండోనేషియాలో వరుస భూకంపాలు

ఇండోనేషియా లో నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు బీబత్సం సృష్టించాయి. మొదటి భూకంపం కేపులాన్‌ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ (ఈఎంఎస్‌సీ) తెలిపింది.

తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండోది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు పేర్కొంది. కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.