త్వరలోనే లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ

80 శాతానికి పైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి

త్వరలోనే లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ
minister ktr-review meeting

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ‌ ఎంసీహెచ్‌ఆర్‌డీలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు మహముద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక, హౌసింగ్‌ శాఖ అధికారులు హాజరయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/