24 గంటల్లో దేశంలో 9,195 కరోనా కేసులు
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్

New Delhi: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకీ మళ్లీ పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. ఇందులో 3,42,51,292 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 143.15 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/