చాప కింద నీరులా ఓమిక్రాన్ కేసులు !

దేశ వ్యాప్తంగా 781 నమోదు

Omicron cases in the country
Omicron cases in the country

ఓమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని 21 రాష్ట్రాలకు ఓమిక్రాన్ కేసులు పాకాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ్టికి 781 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓమిక్రాన్ కేసులు నమోదు కావటం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో 238 కేసులు ఉండగా, మహారాష్ట్ర 167 కేసులతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్ 46, తమిళనాడు, కర్ణాటకలో 34, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్య ప్రదేశ్ లో 9, ఒడిశా లో 8, ఆంద్ర ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 4 కేసులు, చండీగఢ్, జమ్మూకశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్ లలో ఒక్కో కేసు నమోదైంది. ఓమిక్రాన్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై కూడా ఆంక్షలు అమలు లోకి రానున్నాయి.

‘తెర ‘ సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/