కంగనా విలాసవంతమైన యాచకురాలు: నారాయణ

దేశ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్

హైదరాబాద్: భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని… అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఇండియాకు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ… కంగనపై మండిపడ్డారు.

కంగన ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అని ఆయన అన్నారు. పద్మశ్రీ అవార్డు ఆమెకు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఆమెకు లేదని అన్నారు. మోదీ వచ్చాకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. దేశ ప్రజలకు కంగన తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/