భారత్‌లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా మహామ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అదుపులోకి రావడంలేదు. దేశంలో గంట గంటకు కరోనా కేసుల సంఖ్య పెరుగిపోతుంది. కేవలం గత 12 గంటలలో దేశంలో 490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్‌-19 భాధితుల సంఖ్య 4,067 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ వైరస్‌ బారినుండి 292 మంది కోలుకోగా.. 3,666 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/