ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కరోనాను తరిమికొడదాం

దేశ ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ పిలుపు

 soundararajan
soundararajan

హైదరాబాద్‌: భారత్‌లోని ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలని ప్రధాని మోది దివ్వెల వెలుగు కార్యక్రమాన్ని సూచించడంతో, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కుటుంబ సమేతంగా 130 దీపాలను వెలిగించారు. ఈ సందర్బంగా గవర్నర మాట్లాడుతూ.. దేశంలోని 130 కోట్ల మంది దీపాలను వెలిగించి తమ ఐక్యతను చాటారన్నారు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కరోనాను ఎదుర్కోందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రావలసి వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/