రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు – లావణ్య

రాజ్ తరుణ్ – లావణ్య ల వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేమిస్తున్నానని , పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై..మరో హీరోయిన్ మాయలో పడి తనను దూరం చేసాడని చెప్పి లావణ్య అనే యువతీ నర్సింగ్ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిర్యాదు తర్వాత సరైన ఆధారాలు లేవని చెప్పి..రివర్స్ లో పోలీసులు లావణ్య ఫై కేసు ఫైల్ చేసారు. అయితే ఈరోజు లావణ్య సాక్ష్యాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు అందజేయడం తో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు.

ఇక కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. ఆ మెడికల్ డాక్యుమెంట్లు పోలీసులకు అందించా. మాల్వీ వచ్చాక నన్ను దూరం పెట్టాడు’ అని నార్సింగి పోలీసులకు ఆమె మరోసారి ఫిర్యాదు చేశారు. అటు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ లావణ్య పై హీరోయిన్ మాల్వి ఫిల్మ్ నగర్ PSలో కంప్లైంట్ చేశారు. తన సోదరుడికి లావణ్య మెసేజ్‌ లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్‌నగర్‌ PSలో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. కాగా హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే మాల్వి, ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్య పై కూడా కేసు పెట్టాడు.