కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

invitation-to-ap-cm-to-come-to-kanipakam-brahmotsavam

అమరావతిః కాణిపాక వరసిద్ధుడు వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఏపీ సిఎం జగన్‌ను ఆలయ అధికారులు ఆహ్వాన పత్రం అందజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్‌ఎస్‌ బాబు, కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేశ్‌ బాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు.

సెప్టెంబర్‌ 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని వివరించారు. ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను అందజేశారు. ఆహ్వాన పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/