ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

కొత్తగా 1,546 మందికి పాజిటివ్

Rising corona cases in AP
Corona vaccination

Amaravati: ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షల్లో 1,546 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా కరోనాతో 15 మృతి చెందారు. కాగా కరోనా బాధితుల సంఖ్య 19,70, 008కు చేరింది. 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 416 కొత్త కేసులు , చిత్తూరు జిల్లాలో 229, ప్రకాశం జిల్లాలో 201 కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా మృతుల సంఖ్య 13,410కి చేరింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/