‘బుట్టబొమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్న డీజే టిల్లు

డీజే టిల్లు తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ..ఇప్పుడు ఇతర సినిమా ఫంక్షన్లకు హాజరై సందడి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బుట్టబొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసేందుకు రాబోతున్నాడు. అనిఖ సురేంద్రన్ హీరోయిన్ గా పరిచయం చేస్తూ సితార బ్యానర్ వారు ‘బుట్టబొమ్మ’ సినిమాను నిర్మించారు. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక అవార్డులను దక్కించుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

మలయాళంలో విజయవంతమైన ‘కప్పేలా’ సినిమాకి రీమేక్. ఫారెస్టు ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతంలో నడిచే ప్రేమకథ. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ అన్ని కలగలసిన కథ ఇది. సూర్య వశిష్ఠ హీరోగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా స్టిల్స్ ఆకట్టుకోగా..ఫిబ్రవరి 02 న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ను హైదరాబాదులోని ‘పార్క్ హయత్’లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు డీజే టిల్లు ఫేమ్ సిద్దు ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఫిబ్రవరి 04 న ఈ మూవీ థియేటర్స్ లో విడుదలకాబోతుంది.