దీపావళికి వచ్చిన మూడు చిత్రాలు తుస్సు మన్నాయి

చిత్రసీమకు దీపావళి కలిసిరాదని మరోసారి నిరూపితం అయ్యింది. గతంలో దీపావళి రోజు విడుదలైన చిత్రాలు ప్లాప్స్ కాగా..నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు సైతం తుస్సుమన్నాయి. ఈ దీపావ‌ళికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో తెలుగు స్ట్రయిట్ సినిమా మంచి రోజులొచ్చాయి రాగా, తమిళ్ అనువాద చిత్రాలు పెద్ద‌న్న‌, ఎనిమీ థియేట‌ర్ల‌లోకి వచ్చాయి.

మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మంచి రోజులొచ్చాయి చిత్రం ఒక రోజు ముందే ప్రీమియ‌ర్లు ప‌డ్డాయి. ఓ చిన్న సినిమాకి ప్రీమియ‌ర్లు వేయ‌డం సాధార‌ణ‌మైన విష‌యం కాదు. కంటెంట్ పై న‌మ్మ‌కం ఉంటేనే ఇలా చేస్తారు. అయితే మారుతి చేసిన ఈ ప్ర‌య‌త్నం తుస్సుమంది. మారుతి మార్క్ కామెడీ మిస్స‌వ్వ‌డం, క‌థ బేస్ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల మంచి రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. ర‌జ‌నీకాంత్ పెద్ద‌న్న‌గా ప‌ల‌క‌రించాడు. ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో వచ్చి నిరాశ పరిచాడు. 80ల నాటి క‌థ‌లే ఇంత‌క‌న్నా బాగుంటాయని చెప్పారు. విశాల్ చేసిన మ‌రో భారీ సినిమా ఎనిమి కూడా ఆకట్టుకోలేకపోయింది. కేవ‌లం యాక్షన్ సీన్స్‌పై ఆధార ప‌డి తీసిన సినిమా ఇది. మిగిలిన క‌మ‌ర్షియల్ హంగులేవీ అత‌క‌లేదు. దానికి తోడు లాజిక్ లేని మైండ్ గేమ్ తో.. ఈ చిత్రం సాగింది. ఓవరాల్ గా దీపావళి రోజు వచ్చిన ఈ మూడు చిత్రాలు ఆకట్టుకోలేక తుస్సుమనిపించాయి.