నందమూరి ఫ్యాన్స్ తో జత కలిసిన మహేష్ ఫ్యాన్స్

నందమూరి ఫ్యాన్స్ తో జత కలిసిన మహేష్ ఫ్యాన్స్

తమ అభిమాన హీరో సినిమా వస్తే..వారు మాత్రం సంబరాలు చేసుకుంటారు. మిగత హీరోల అభిమానులు అస్సలు పట్టించుకోరు. కానీ అఖండ విషయంలో మాత్రం మరోటి జరిగింది. అఖండ రిలీజ్ సందర్బంగా మహేష్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ షేర్ చేస్తున్నారు. మహేష్ అభిమానులు ఇలా చేయడం నందమూరి అభిమానులకు షాక్ కలిగిస్తుంది. దీనికి కారణం అంతకు ముందు మహేష్ సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించి నందమూరి అభిమానులు షేర్ చేయడం…పబ్లిసిటీ చేయడం చేసారు. అందుకే ఇప్పుడు అఖండ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు.

ఇక సర్కారు చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉంది. రిలీజ్ కి ఏప్రిల్ వరకూ వాయిదా పడటంతో టీమ్ నెమ్మదిగానే షూటింగ్ చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ మోకాలికి గాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగానే బాలయ్య ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.సర్కార్ వారి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అదుపు తప్పి మహేష్ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి చిన్న సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారుట. వచ్చే వారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఈ సర్జరీ జరగనుంది.