‘NBK107’ నాన్-థియేట్రిక‌ల్ రైట్స్ కేక పుట్టిస్తుంది

అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగానే ఈ చిత్ర నాన్-థియేట్రిక‌ల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు. దాదాపు రూ.60 కోట్ల‌కు ఈ సినిమా నాన్-థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడు పోయాయని అంటున్నారు. అఖండ స‌క్సెస్‌తో ఈ సినిమాకు భారీ రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గుతుంద‌ట‌. ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ దాదాపు రూ.70 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బ‌య్య‌ర్ల నుండి ఫ్యాన్సీ రేటుతో ఆఫ‌ర్స్ వస్తున్నాయని చెపుతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌నవ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘జై బాల‌య్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత బాల‌కృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసంద‌D’ ఫేం శ్రీలీలా, బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టిస్తుంది.